బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్
Gutta Jwala announces wedding date.గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తామని విష్ణు చెప్పాడు.
By తోట వంశీ కుమార్ Published on
13 April 2021 8:36 AM GMT

గత కొంతకాలంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా జ్వాలా.. విష్ణు ఇంటికి వెళ్లి అతడికి సర్‌ప్రైజ్ ఇవ్వడం.. వాటిని విష్ణు సోషల్ మీడియాలో పోస్టు చేయడం చూశాం.. కాగా.. ఇటీవల త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తామని విష్ణు చెప్పాడు. ఇక అతడు చెప్పినట్లే తాజాగా పెళ్లి తేదీని ప్రకటించారు.
ఈ నెల 22న తాము వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమ వివాహా శుభలేఖను కూడా అందులో పోస్టు చేశారు. తమ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో తాము పెళ్లి చేసుకోబోతున్నామని, ఈ విషయాన్ని అంబరాన్నంటే సంతోషంతో ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇన్నేళ్లుగా తమపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఇరువురూ సంయుక్తంగా ప్రకటన చేశారు. కాగా..వీరిద్దరికి ఇది రెండవ వివాహాం కావడం గమనార్హం.
Next Story