గుణ‌తిల‌క ఔట్ పై ర‌చ్చ ర‌చ్చ‌.. ఎలా ఔట్ ఇస్తారంటూ.. వీడియో వైర‌ల్‌

Gunathilaka's obstructing the field dismissal divides the cricket world.శ్రీలంక, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో ఓ వివాదం నెల‌కొంది. లంక బ్యాట్స్‌మెన్ గుణ‌తిల‌క ను థ‌ర్డ్ ఎంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించిన తీరుపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2021 7:44 AM GMT
Gunathilakas obstructing the field dismissal divides the cricket world

శ్రీలంక, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో ఓ వివాదం నెల‌కొంది. లంక బ్యాట్స్‌మెన్ గుణ‌తిల‌క ను థ‌ర్డ్ ఎంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించిన తీరుపై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. 'అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్‌'గా ప‌రిగ‌ణించిన థ‌ర్డ్ ఎంఫైర్ ఔట్ ఇవ్వడాన్ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు. అయితే.. గుణ‌తిల‌క అనుకోకుండా బంతిని త‌న్నాడ‌ని ఉద్దేశ్య‌పూర్వ‌కంగా చేయ‌లేద‌ని నెటిజెన్లు మండిప‌డుతున్నారు. అత‌డిని ఔటివ్వాల్సింది కాద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్ర‌స్తుతం గుణ‌తిల‌క ఔట్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. 21.1 ఓవ‌ర్‌ను పొలార్డ్ వేశాడు. గుణ‌తిల‌క ఆ బంతిని డిఫెన్స్ ఆడాడు. బంతి అత‌డి కాళ్ల వ‌ద్దే ఆగిపోయింది. అది గ‌మ‌నించ‌కుండా గుణ‌తిల‌క కాస్త ముందుకు వెళ్లాడు. పొలార్డ్ ర‌నౌట్ చేయ‌డానికి వ‌స్తున్న‌ట్లు గ‌మ‌నించి మ‌రో ఎండ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్ ను ప‌రుగు కోసం రావొద్ద‌ని సూచించాడు. అదే స‌మ‌యంలో అత‌డు కూడా క్రీజులోకి వెన‌క్కి ప‌రుగెత్తాడు. ఆ స‌మ‌యంలో అనుకోకుండా బంతిని కాలితో త‌న్నాడు. అప్ప‌టికే పొలార్డ్ ర‌నౌట్ చేయ‌డానికి బంతి ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. గుణ‌తిక‌ల కావాల‌నే బంతిని త‌న్నాడ‌ని.. విండీస్ ఆట‌గాళ్లు ఔట్ కోసం అంఫైర్‌కు అప్పీలు చేశారు.

దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ జో విల్స‌న్ సాఫ్ట్ సిగ్న‌ల్‌గా అవుట‌ని ప్ర‌క‌టించి మూడో అంపైర్ నిగెల్ గుగైడ్‌ని అడిగాడు. వీడియోను వివిధ కోణాల్లో ప‌రిశీలించిన మూడో అంపైర్.. గుణ‌తిల‌క‌ను అవుట్‌గా ప్ర‌క‌టించాడు. క్రికెట్ రూల్స్ ప్ర‌కారం ఎవ‌రైనా బ్యాట్స్‌మెన్ ఉద్దేశ్య‌పూర్వ‌కంగా త‌మ మాట్లాల‌తో లేదా చేష్ట‌ల‌తో పీల్డింగ్ చేస్తున్న జ‌ట్టుకు అడ్డంకులు సృస్టిస్తే ఆ బ్యాట్స్‌మెన్‌ను అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్‌గా ప‌రిగ‌ణిస్తే ఔటిస్తారు. బ్యాట్స్‌మ‌న్ కావాల‌ని అడ్డుకున్న‌ట్లుగా వీడియోలో స్ప‌ష్ట‌మైన ఆధారాలేవీ క‌న‌పించ‌క‌పోయినా మూడో అంపైర్ అవుట్‌గా ప్ర‌క‌టించ‌డం వివాదానికి కార‌ణ‌మైంది.

ఈ నిర్ణ‌యంపై శ్రీలంక డైరెక్ట‌ర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. నెటిజ‌న్లు కూఐడా గుణ‌తిల‌కను ఔటివ్వాల్సింది కాద‌ని మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.





Next Story