రాజస్థాన్ ను చిత్తు చేసిన గుజరాత్
Gujarat Titans edge closer to playoffs after huge win over Rajasthan Royals. గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయాన్ని అందుకుంది.
By Medi Samrat Published on 6 May 2023 7:59 AM ISTగుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ పై 9 వికెట్ల తేడాతో ఓడించింది. 119 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఎంతో సునాయాసంగా చేరుకుంది. జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ కేవలం 1 వికెట్ నష్టానికి 13.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 41, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39 పరుగులతో అజేయంగా నిలిచారు. శుభ్ మాన్ గిల్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో చహల్ కు ఓ వికెట్ దక్కింది. మిగిలిన బౌలర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ టైటాన్స్ జట్టులోని ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన 30 పరుగులే అత్యధికం. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 14, దేవదత్ పడిక్కల్ 12 పరుగులు సాధించారు. జోస్ బట్లర్ (8), హెట్మెయర్ (7), రియాన్ పరాగ్ (4), ధ్రువ్ జోరెల్ (9), అశ్విన్ (2) పెద్దగా ప్రభావం చూపలేదు. రషీద్ ఖాన్ కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, జాషువా లిటిల్ 1 వికెట్ తీశారు.