ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ గురువారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్లో ఛేదించింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ టోర్నమెంట్‌లో చేరింది. మొదటి సీజన్‌లోనే ఈ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది కూడా గుజరాత్ జట్టు బాగానే ఆడుతుంది. ఈ ఏడాది కూడా గుజరాత్ తన టాప్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ టీమ్‌ని చేజ్ మాస్టర్‌గా పిలుస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ మొత్తం 12 మ్యాచ్‌లలో చేజింగ్ చేయగా.. 11 గెలిచారు. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది గుజరాత్.
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు గుజరాత్ అద్భుతమైన బౌలింగ్ ముందు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. మోహిత్ శర్మ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఈ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. మోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.