యువీకి గోవా టూరిజం శాఖ నోటీసులు

Goa tourism department issues notice to Yuvraj Singh.టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2022 11:12 AM IST
యువీకి గోవా టూరిజం శాఖ నోటీసులు

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అధికారుల నుంచి అనుమ‌తి లేకుండానే త‌న విల్లాను గెస్ట్‌ల కోసం అద్దెకు ఇవ్వ‌నున్న‌ట్లు యువీ ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంపై గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్ర‌కారం ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ప్ర‌భుత్వం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ త‌ప్పనిస‌రిగా చేసుకోవాల్సి ఉంటుంది.

యువ‌రాజ్ సింగ్‌కు గోవాలోని మెర్జిమ్‌లో 'కాసా సింగ్' పేరుతో విలాస‌వంత‌మైన భ‌వ‌నం ఉంది. ఈ భ‌వ‌నాన్ని ప‌ర్యాట‌కుల‌కు అద్దెకు ఇస్తాన‌ని యువీ ఆన్‌లైన్‌లో ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. టూరిజం శాఖ నిబంధ‌నల‌కు అనుగుణంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకం అని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేష‌న్ చేసుకోకుండా ఉన్నందుకు జ‌రిమానా ఎందుకు విధించ‌కూడ‌దో చెప్పాల‌ని టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ రాజేశ్ కాలే పేరిట నోటీసు జారీ అయింది. డిసెంబ‌ర్ 8న ఉద‌యం 11 గంట‌ల‌కు యువీ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రై ఇవ్వాల‌ని అధికారులు అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా గ‌తంలో యువీ చేసిన ట్వీట్‌ల‌ను కూడా నోటీసుల్లో పేర్కొన్నారు.

Next Story