ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రోజు ఎంత విధ్వంసం సృష్టించగలడో ప్రతి ఒక్కరికీ తెలిసిందే..! ముఖ్యంగా 360 డిగ్రీస్ ఆటగాడిగా పేరు సంపాదించిన మ్యాక్స్ వెల్.. బ్యాటింగ్ స్టాన్స్ మార్చి ఆడే షాట్స్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో స్విచ్ హిట్స్ ఆడటం అతడికి బాగా అలవాటు. ఇక ఈరోజు భారత్ తో ఆస్ట్రేలియా తలపడనుంది. అందుకోసం మ్యాక్స్ వెల్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడుతూ మ్యాక్స్ వెల్ అలరించాడు.
'స్విచ్-హిట్' ను అద్భుతంగా ఉపయోగించే ఆటగాళ్ళలో మాక్స్‌వెల్ ఒకడు. ఉన్నట్లుండి అతను ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తుంటాడు. ఈ సిరీస్ లో భారత స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌పై ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, ప్రాక్టీస్ సెషన్‌లో మాక్స్‌వెల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ లో భారీ షాట్‌లు కొట్టడం కనిపించింది
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల T20I సిరీస్ తర్వాత, సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే మూడు T20Iలు, మూడు ODIల సిరీస్ కోసం టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఆ తర్వాత నేరుగా 2022 T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. టోర్నమెంట్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.