మాక్స్‌వెల్ ఫైర్‌.. సోష‌ల్ మీడియాలో చెత్తవాగుడు వాగకండి

Glenn Maxwell fired on social media abusers.ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో మ‌రోసారి ఫైన‌ల్ చేర‌కుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 8:02 AM GMT
మాక్స్‌వెల్ ఫైర్‌.. సోష‌ల్ మీడియాలో చెత్తవాగుడు వాగకండి

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో మ‌రోసారి ఫైన‌ల్ చేర‌కుండా ఇంటి ముఖం ప‌ట్టింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. సోమ‌వారం రాత్రి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నాలుగు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో కోహ్లీసేన‌ను ఉద్దేశిస్తూ కొంద‌రు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర‌మైన కామెంట్లు చేస్తున్నారు. వీటిపై ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు మాక్స్‌వెల్ స్పందించాడు. ఆర్‌సీబీకి ఇది మంచి సీజ‌నేన‌ని అయితే.. తాము అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. సోష‌ల్ మీడియాలో చెత్త వాగుడు తీవ్రంగా క‌లిచివేసింది మాక్సీ ట్వీట్ చేశాడు.

'ఆర్‌సీబీకి ఇది గొప్ప సీజన్ అనే చెప్పాలి. దురదృష్టవశాత్తు మేము ఫైనల్స్ చేరుకోలేకపోయాం. అయితే అద్భుతమైన సీజన్‌కు ఏ మాత్రం తీసిపోదు. సోషల్ మీడియాలో చెత్త ఎప్పుడూ ఉంటుంది. కానీ కొందరు వారి లిమిట్స్ దాటేస్తున్నారు. చెత్తచెత్త కెమెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కొన్ని అసహ్యంగా ఉన్నాయి. మేము మనుషులమే. ప్రతిరోజూ మా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించండి. మాకు అండ‌గా నిలిచి ఎల్ల‌వేళ‌లా ప్రేమాభిమానాలు కురిపించిన నిజ‌మైన ఆర్‌సీబీ అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు. మీరు వాళ్ల‌లా ఉండ‌కండి అని మాక్స్‌వెల్ ట్వీట్ చేశాడు.

గ‌తేడాది విఫ‌లైన మాక్స్‌వెల్.. ఈ సీజ‌న్‌లో అద్బుతంగా ఆడాడు. 15 మ్యాచ్‌ల్లో ఆరు అర్థ‌శ‌త‌కాల‌తో 513 ప‌రుగులు సాధించిన ఆర్‌సీబీ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే.. కీల‌క‌మైన ఎలిమినేట‌ర్‌లో 15 ప‌రుగులే చేసి నిరాశ‌ప‌రిచాడు.

Next Story
Share it