సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దాదాపు ఆడడనే సంకేతాలు వచ్చాయి. కోల్‌కతాలో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పి కారణంగా గిల్ మధ్యలోనే నిష్క్రమించాడు. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడు గువాహటి టెస్టు ఆడడనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించాడు. గిల్ కోలుకుంటున్నాడని, ఫిజియోలు, డాక్టర్ల నిర్ణయాన్ని బట్టే అతడి ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుందన్నాడు.
ప్రస్తుతానికి గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ మ్యాచ్ సమయంలో నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు. ఒకవేళ గిల్ ఆడకపోయినా చాలా మంది బ్యాటర్లు అందుబాటులో ఉన్నారన్నారు. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గిల్ ఆడే నాలుగో స్థానంలో ధ్రువ్ జురెల్ అందుబాటులో ఉన్నాడని స్పష్టం చేశాడు.