ఐపీఎల్ నుంచి గేల్ ఔట్‌.. కార‌ణం ఏంటంటే..?

Gayle pulls out of IPL 2021.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2021 11:03 AM IST
ఐపీఎల్ నుంచి గేల్ ఔట్‌.. కార‌ణం ఏంటంటే..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు క్రిస్‌గేల్ మిగిలిన మ్యాచ్‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. క‌రోనా కార‌ణంగా ఏర్పాటు చేసిన బ‌యో బ‌బుల్ లో చాలా కాలంగా ఉంటూ రావడంతో మాన‌సికంగా తాను బాగా అల‌సిపోయాన‌ని అన్నాడు. ఐపీఎల్ అనంత‌రం ప్రారంభం కానున్న టీ 20 ప్ర‌పంచక‌ప్ కు నూత‌న ఉత్సాహంతో బ‌రిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్న‌ట్లు గేల్ వెల్ల‌డించాడు. ఇటీవ‌ల సీపీఎల్‌లో ఆడిన గేల్ అక్క‌డ నుంచి నేరుగా ఐపీఎల్‌కు వ‌చ్చాడు. ఈ సీజ‌న్ రెండో ద‌శ‌లో రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన గేల్‌.. ఆశించ‌న మేర రాణించ‌లేదు.

ఇక గేల్ తీసుకున్న నిర్ణ‌యానికి పంజాబ్ కింగ్స్ యాజ‌మాన్యం మ‌ద్ద‌తు ఇచ్చింది. టీ20 లో గేల్ రాణించాల‌ని కోరుకుంటున్న‌ట్లు త‌న ట్విట‌ర్ పేజీలో కింగ్స్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో పంజాబ్ ఇంకో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజ‌యం సాధిస్తేనే ప్లే ఆప్ బెర్త్ చేరుకునే అవ‌కాశం ఉంది. ఇప్పటికే చెన్నై జ‌ట్టు ప్లే ఆప్‌కు చేరుకోగా.. దాదాపుగా ఢిల్లీ కూడా చేరుకున్న‌ట్లే. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం బెంగ‌ళూరు, కోల్‌క‌తా, ముంబై, రాజ‌స్థాన్‌, పంజాబ్ పోటిప‌డుతున్నాయి.

Next Story