బీసీసీఐ ఇంటర్వ్యూకు వెళ్ల‌నున్న గంభీర్.. సాయంత్రానికి అంతా సెట్ అంటున్నారు..!

పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంటర్వ్యూ చేయనుంది.

By Medi Samrat  Published on  18 Jun 2024 1:54 PM IST
బీసీసీఐ ఇంటర్వ్యూకు వెళ్ల‌నున్న గంభీర్.. సాయంత్రానికి అంతా సెట్ అంటున్నారు..!

పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంటర్వ్యూ చేయనుంది. బీసీసీఐ సెక్రటరీ జై షా, ఇతర అధికారులు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

BCCIకి సన్నిహితమైన ఒక మూలం INSతో మాట్లాడుతూ.. "గౌతీ (గౌతమ్ గంభీర్) BCCI ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ కోసం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముంబైకి చేరుకుంటారు. టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్ అతనే కావడం దాదాపు ఖాయమైంది. గంభీర్ షరతులను బీసీసీఐ అంగీకరించిందని.. ప్రధాన కోచ్‌ ఎవరనేది త్వరలో వెల్లడికానుంది. ఈ సమావేశం 2 గంట‌ల నుంచి 4 గంట‌ల మధ్య జరగనుంది.

జట్టుపై పూర్తి నియంత్రణ, వైట్, రెడ్ బాల్ కోసం ప్రత్యేక జట్లు వంటి ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్ బిసిసిఐకి కొన్ని డిమాండ్లను ముందుకు తెచ్చాడు, దీనిని బిసిసిఐ అంగీకరించిందని.. అతనిని నియమించాలని ఐఎన్ఎస్ నివేదిక చెబుతుంది.

ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది, దీనికి చివరి తేదీ మే 27. కొత్త భారత పురుషుల ప్రధాన కోచ్ జులై 2024 నుండి డిసెంబర్ 2027 వరకు మూడు ఫార్మాట్‌లలో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సివుంటుంది.

భారత ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ కాంట్రాక్ట్ నవంబర్‌లో 2021 T20 ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమైంది. 2023 ODI ప్రపంచ కప్‌తో సొంతగడ్డపై ముగిసింది. ఆ త‌ర్వాత‌ ఈ సంవత్సరం T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ వరకు పొడిగించబడింది.

Next Story