Video : పిచ్‌ క్యూరేటర్ బెదిరింపులకు త‌న‌దైన స్టైల్లో బ‌దులిచ్చిన‌ గంభీర్..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓవల్ గ్రౌండ్స్‌మెన్‌తో గొడవపడ్డాడు.

By Medi Samrat
Published on : 29 July 2025 6:18 PM IST

Video : పిచ్‌ క్యూరేటర్ బెదిరింపులకు త‌న‌దైన స్టైల్లో బ‌దులిచ్చిన‌ గంభీర్..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓవల్ గ్రౌండ్స్‌మెన్‌తో గొడవపడ్డాడు. మంగళవారం టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. గ్రౌండ్స్‌మన్ కొన్ని మాటలు మాట్లాడాడు.. గంభీర్‌కు ఇష్టం లేని వ్యాఖ్య‌లు చేయడంతో అతను క్యూరేటర్‌ను తీవ్రంగా తిట్టాడు. ఈ ఫైట్‌పై గ్రౌండ్స్‌మెన్ లీ ఫోర్టిస్ స్పందన వెలుగులోకి వచ్చింది.

భారత్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్యూరేటర్ ఏ పిచ్ ఉపయోగించాలో, ఏది ఉప‌యోగించ‌కూడ‌దో చెప్పాడు. ఈ విష‌య‌మై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తానని క్యూరేటర్ అతన్ని బెదిరించాడు. ఈ విషయాలు విన్న గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అంత‌టితో గంభీర్ ఆగలేదు.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్యూరేటర్‌తో మాట్లాడుతున్న సమయంలో గంభీర్ వెళ్లి రిపోర్ట్ చేయమని సీరియ‌స్‌గా చెప్పాడు. ఏం చేయాలో, ఏమి చేయకూడదో మీరు మాకు చెప్పొద్ద‌ని క్యూరేటర్‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడు.

దీని తరువాత.. భారతీయ మీడియా ఇందుకు సంబంధించి క్యూరేటర్ నుండి అతని వాద‌న‌ తెలుసుకోవాలనుకుంది.. కానీ అతడు ఏమీ మాట్లాడలేదు. గౌతమ్ గంభీర్ విష‌యంలో మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగినప్పుడు? అందుకు బ‌దులిస్తూ.. గంభీర్‌తో నేను సంతోషంగా ఉన్నానో లేదో నిర్ణయించుకోవడం నా పని కాదు అని అన్నాడు. నేను అతనిని ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. బహుశా నేను అతనితో ఆడివుండ‌వ‌చ్చు అని పేర్కొన్నాడు.

అంతేకాదు.. గంభీర్ మీపై ఎందుకు కోపంగా ఉన్నాడు? అడ‌గ‌గా.. క్యూరేటర్ బ‌దులిస్తూ.. నాకు తెలియదు అన్నాడు.

ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి అని అడిగగా.. నాకు ఏ స్టాండ్ లేదు.. పర్వాలేదు.. దాచడానికి ఏమీ లేదు. నేను అలా ప్రవర్తించడం ఆయ‌న‌కు ఇష్టం లేదు కావ‌చ్చ‌ని బ‌దులిచ్చాడు.

గ‌తంలో కూడా.. లీకి విజిటింగ్ టీమ్‌తో గొడవపడి వారిని వేధించడంతో పాటు వెక్కిరించడం పాత అలవాటు. భారత మహిళల జట్టు ఈ మైదానంలో ఆడేందుకు వచ్చినప్పుడు కూడా వారి పట్ల క్యూరేటర్ దారుణంగా ప్రవర్తించారు. విజిటింగ్ టీమ్‌లతో అతను దూకుడుగా ప్రవర్తిస్తాడు. అయితే, గంభీర్ దీనిని తట్టుకోలేక అతడిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.. ఇది అతనిని షాక్‌కు గురిచేసింది.

Next Story