ప్లేయింగ్-11లో ఆ ఇద్ద‌రికి చోటు దక్కడం కష్టమే.. గంభీర్ మాట‌ల‌కు అర్ధం అదే..!

సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on  18 Sep 2024 7:57 AM GMT
ప్లేయింగ్-11లో ఆ ఇద్ద‌రికి చోటు దక్కడం కష్టమే.. గంభీర్ మాట‌ల‌కు అర్ధం అదే..!

సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. తొలి టెస్టుకు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈరోజు చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలి టెస్టు కోసం భారత్‌ ప్లేయింగ్-11కి సంబంధించి గంభీర్ మీడియా సమావేశంలో పెద్ద ప్రకటన చేశాడు.

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్‌లను ప్లే-11లో చేర్చడం గురించి పెద్ద సూచన ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపిక చేసిన‌ భారత జట్టులో సర్ఫరాజ్, యశస్వి, ధ్రువ్ జురైల్ వంటి యువకులు చోటు దక్కించుకున్నారు. అయితే.. ఒక జట్టు నుంచి కేవలం 11 మంది ఆటగాళ్లకు మాత్రమే ఆడేందుకు అనుమతి ఉంటుందని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం పొందడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. తొలి టెస్టులో రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడ‌ని గౌతమ్ గంభీర్ అన్నాడు. పంత్ జ‌ట్టు కోసం ఓపెన‌ర్‌గా బ‌రిలో దిగుతాడ‌ని గంభీర్ అన్నాడు. వికెట్‌కీపర్‌గా కూడా అద్భుత ప్రదర్శన చేస్తాడ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశాడు.

Next Story