ట్రక్కు ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు.. గంభీర్‌కు ఎంత కోప‌మో చెప్పిన తోటి క్రికెట‌ర్‌

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పిలవ‌డంలో తప్పేమీ లేదు.

By Medi Samrat  Published on  16 Sep 2024 11:53 AM GMT
ట్రక్కు ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు.. గంభీర్‌కు ఎంత కోప‌మో చెప్పిన తోటి క్రికెట‌ర్‌

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పిలవ‌డంలో తప్పేమీ లేదు. తాజాగా అతనే యాంగ్రీ మ్యాన్ అనే బిరుదును ఇచ్చుకున్నాడు. గౌతమ్ గంభీర్ మైదానంలో కోపంతో నిగ్రహాన్ని కోల్పోవడం చాలాసార్లు చూశాం. ఐపీఎల్‌లో కూడా ఎల్‌ఎస్‌జీ మెంటార్‌గా గంభీర్ విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు. ఇదిలా ఉండగా, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించిన ఒక వింత ఘ‌ట‌న‌ను.. రాజ్ షమానీ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పంచుకున్నారు.

గౌతమ్ గంభీర్, ఆకాష్ చోప్రా ఇద్దరూ దాదాపు ఏకకాలంలో క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆకాశ్ చోప్రా ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించిన భయానక కథను వివరించాడు. ట్రక్ డ్రైవర్‌తో గంభీర్ పోరాడగలడని ఎవరికీ తెలియదని ఆకాష్ అన్నాడు. తాను ఢిల్లీలో గంభీర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునేవాడినని చోప్రా చెప్పాడు.

గంభీర్ గురించి మాట్లాడుతూ.. “గంభీర్ మొద‌టినుండి ఇలాగే ఉన్నాడు. అతడు ఆట కోసం చాలా కష్టపడతాడు. కొంచెం సీరియస్‌గా ఉన్నా చాలా పరుగులు చేశాడు. అతడు ఎప్పుడూ తన హృదయం లోతుల్లోంచి మాట్లాడతాడు. మానసికంగా.. అతడు చాలా త్వరగా కోపం తెచ్చుకోగలడు. కానీ ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఢిల్లీలో ఓ ట్రక్ డ్రైవర్‌తో గంభీర్ గొడవపడ్డాడు. డ్రైవర్ రాంగ్ టర్న్ తీసుకుని దుర్భాషలాడడంతో గంభీర్ తన కారు దిగి ట్రక్కుపైకి ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. అప్పుడు నేను.. 'గౌతీ, నువ్వు ఏం చేస్తున్నావ్?' అని అడిగాను, అతడు ట్రక్ డ్రైవర్.. నువ్వు ఈ పొజిష‌న్‌లో ఉన్నావు అని వారించిన‌ట్లు చెప్పాడు.

ఇదిలావుంటే.. ఆకాష్ చోప్రా ఎక్కువ కాలం జట్టులో శాశ్వత స్థానం సంపాదించలేకపోయాడు. కేవలం 10 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

Next Story