ఆ ఓటమితో నిద్రపట్టలేదు.. రాత్రంతా ఏడ్చా: గౌతమ్ గంభీర్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత్ విజయం సాధించింది. కప్‌ను సొంతం చేసుకుంది. ఈ
By Srikanth Gundamalla
ఆ ఓటమితో నిద్రపట్టలేదు.. రాత్రంతా ఏడ్చా: గౌతమ్ గంభీర్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత్ విజయం సాధించింది. కప్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగానే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 1992లో భారత్ లీగ్ స్టేజ్ నుంచి ఇంటి ముఖం పట్టింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే.. ఆరోజు రాత్రి తనకు నిద్రపట్టలేదని గౌతమ్ గంభీర్ చెప్పాడు. భారత్ వరల్డ్ కప్ గెలవాలని ప్రతిజ్ఞ చేసినట్లు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన వయసు 11 ఏళ్లు అనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
బ్రిస్బేన్ వేదికగా 1992 వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ ఆసీస్‌తో ఆడిందని చెప్పాడు గంభీర్. చివరివరకూ ఆ మ్యాచ్‌లో పోరాడినా ఒక్క పరుగు తేడాతో ఓడింది. దాంతో.. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. అంతకుముందు కానీ.. ఆ తర్వాత కానీ ఎప్పుడూ అలా బాధపడ్డ సందర్భాలు లేవు. ఆ రోజు మాత్రం ఎందుకు అలా ఏడ్చానో తెలియదు. నాకు అప్పుడు 11 ఏళ్లు. భారత్ కోసం వరల్డ్ కప్ నెగ్గుతానని అనుకున్నా. నా కల 2011లో నెరవేరింది 32 ఏళ్ల కిందట జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో వెంకటపతిరాజు రనౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్ మన సమయం వేకువజామునే జరిగింది. తెల్లవారే 5 గంటలకు మ్యాచ్ లేచి చూశా' అని గౌతమ్ గంభీర్ చెప్పాడు. కాగా.. అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 237/9 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూఇయస్ పద్ధతి ప్రకారం 47 ఓవర్లకు 235 గా నిర్ధేశించారు. కానీ.. భారత్ సరిగ్గా 234 పరుగుల చేసి ఓటమిపాలైంది.
ఆ తర్వాత గంభీర్ అనుకున్నట్లుగానే రెండుసార్లు వరల్డ్ కప్‌లను భారత్ గెలవడంలో ముఖ్యపాత్ర వహించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా.. ఇప్పుడు భారత జట్టు ప్రధాన కోచ్ పదవి ఖాళీ అయ్యింది. ఆ స్థానంలోగంభీర్ ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.