అత‌డే మా ప‌స్ట్ ఛాయిస్‌.. ఇద్దరు వికెట్ కీపర్ల‌తో ఆడలేం.. రిషబ్ పంత్‌కు షాకిచ్చిన‌ గంభీర్..!

రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ మొదటి ఎంపిక అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ధృవీకరించారు.

By Medi Samrat  Published on  13 Feb 2025 9:59 AM IST
అత‌డే మా ప‌స్ట్ ఛాయిస్‌.. ఇద్దరు వికెట్ కీపర్ల‌తో ఆడలేం.. రిషబ్ పంత్‌కు షాకిచ్చిన‌ గంభీర్..!

రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ మొదటి ఎంపిక అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ధృవీకరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా రిషబ్ పంత్ బెంచ్‌పై కూర్చోవలసి ఉంటుందని గంభీర్ సూచించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మిగతా సభ్యులందరికీ కనీసం ఒక్క అవకాశం లభించినా ఆడే అవకాశం రాని ఏకైక ఆటగాడు పంత్. KL రాహుల్ మొదటి రెండు మ్యాచ్‌లలో నంబర్-6 వద్ద బ్యాటింగ్‌కు వ‌చ్చి పోరాడుతూ కనిపించాడు, కానీ మూడవ మ్యాచ్‌లో అతడు నంబర్-5లో వచ్చి 29 బంతుల్లో 40 పరుగులు చేసి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని ఇంగ్లండ్‌పై 3-0తో టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది.

గంభీర్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ మా నంబర్-1 వికెట్ కీపర్ అని ఈ తరుణంలో నేను చెప్పగలను. రిషబ్ పంత్‌కు అవకాశం లభిస్తుంది, కానీ ప్రస్తుతం KL రాహుల్ బాగా రాణిస్తున్నాడు. మేము ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లతో ఆడలేము అని స్ప‌ష్టం చేశాడు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ బలమైన సగటును కలిగి ఉండగా.. ప్రారంభ మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ కంటే అక్షర్ పటేల్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారని గంభీర్‌ను అడిగినప్పుడు.. వ్యక్తిగత గణాంకాల కంటే జట్టు ప్రాధాన్యత ముఖ్య‌మ‌న్నాడు. మేము సగటులు, గణాంకాలను చూడము. మా దృష్టి ఎవరినైనా.. ఎప్పుడు అద్భుత‌ ప్రదర్శన చేయ‌గ‌ల‌రో అప్పుడే ఉప‌యోగించుకుంటామ‌న్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి యశస్వి జైస్వాల్‌ను తప్పించడం వ్యూహాత్మక నిర్ణయమని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఐదో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని ఎందుకు చేర్చారో వివరించాడు. గంభీర్ మాట్లాడుతూ.. 'ఒకే కారణం.. మాకు వికెట్ టేకింగ్ ఎంపిక అవసరం.. వరుణ్ చక్రవర్తి ఆ ఎంపిక అని మాకు తెలుసు. యశస్వి జైస్వాల్‌కు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. మేము జట్టులో కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచగలము అని పేర్కొన్నాడు.

Next Story