మొన్న పైస‌ల్ వ‌చ్చిన‌య్ కానీ ఇజ్జ‌త్ రాలేదు.. ఇప్పుడు పైస‌ల్ తో పాటు ఇజ్జ‌త్ కూడా

Funny Memes On Chris Morris.క్రిస్ మోరిస్‌.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజ‌న్ కు సంబంధించిన మినీ వేలంపాట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 6:01 AM GMT
Chris Morris

క్రిస్ మోరిస్‌.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజ‌న్ కు సంబంధించిన మినీ వేలంపాట జ‌రిగిన‌ప్ప‌టి నుంచి హాట్ టాఫిక్‌గా మారాడు. నిఖార్స‌యిన ఆల్‌రౌండ‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆట‌గాడి కోసం రాజ‌స్థాన్ వేలంలో రూ.16.25 కోట్లు వెచ్చించి మ‌రీ సొంతం చేసుకుంది. దీంతో ఇత‌డి పేరు మార్మోగిపోయింది. మ‌రీ అంత ధ‌ర పెట్టి కొనుకున్న ఆట‌గాడిపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ న‌మ్మ‌కం లేనట్లుగా అనిపించింది తొలి మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ చూసిన వారెవ‌రికైనా.

పంజాబ్స్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా క్రిస్ మోరిస్ చివరి ఓవర్ వరకూ ఆడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మోరిస్‌కు స్ట్రైక్ ఇవ్వడానికి సంజు శాంసన్ నిరాకరించాడు. అతను ఆడలేడని, బంతులను వృధా చేస్తాడనే కారణంతో రన్ తీసే అవకాశం వచ్చినప్పటికీ.. శాంసన్ దాన్ని తీయలేదు. ఆ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అయితే.. తానెంత‌టీ విలువైన ఆట‌గాడినో అనే విష‌యాన్ని రెండో మ్యాచ్‌లో చూపించాడు మోరీస్‌. ఢిల్లీతో జ‌రిగిన థ్రిల్లర్‌ మ్యాచ్ లో కేవ‌లం 18 బంతుల్లో 4 సిక్స్‌లు బాది 36 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి రెండు బంతులు ఉండ‌గానే రాజ‌స్థాన్‌కు ఒంటిచేత్తో విజ‌యాన్ని అందించాడు.

ఇందుకేనా ఇత‌న్ని 16 కోట్ల‌కుపైగా పెట్టి కొన్న‌ది అని తొలి మ్యాచ్ త‌ర్వాత అన్న వాళ్లే.. ఇప్పుడు మోరిస్ ఆట చూసి ఫ‌న్నీ మేమ్స్‌తో ట్విట‌ర్‌ను నింపేస్తున్నారు. ఇందులో టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందున్నాడు. మొన్న‌టి మ్యాచ్‌, ఇప్ప‌టి మ్యాచ్ ఫొటోల‌ను అత‌డు షేర్ చేస్తూ.. 'మొన్న పైస‌ల్ వ‌చ్చిన‌య్ కానీ ఇజ్జ‌త్ రాలేదు.. ఇప్పుడు పైస‌ల్ వ‌చ్చిన‌య్‌.. ఇజ్జ‌త్ కూడా' అని వీరూ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. అత‌నిలాగే మిగ‌తా నెటిజ‌న్లు కూడా మేమ్స్‌తో మోరిస్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తారు.
Next Story
Share it