ప్రారంభం కాని నాలుగో రోజు ఆట‌.. టేబుల్ టెన్నిస్ ఆడుతున్న క్రికెట‌ర్లు

Fourth day of WTC Final not started yet.ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు ఆటంకాలు తొల‌గ‌డం లేదు. అంతా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 10:47 AM GMT
ప్రారంభం కాని నాలుగో రోజు ఆట‌.. టేబుల్ టెన్నిస్ ఆడుతున్న క్రికెట‌ర్లు

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు ఆటంకాలు తొల‌గ‌డం లేదు. అంతా ఊహించిన‌ట్లుగా నాలుగో రోజు ఆట‌కు వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. సోమ‌వారం ఉద‌యం నుంచి సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త త‌గ్గిన‌ట్లు అనిపించినా.. జ‌ల్లులు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో ఎజియ‌స్ బౌల్ స్టేడియం మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. క‌వ‌ర్ల‌పై వ‌ర్షం నీరు నిలిచింది. ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. దీంతో నాలుగో రోజు ఆట ప్రారంభం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

కాగా.. సౌథాంప్ట‌న్‌లో ప‌రిస్థితి ఎలా ఉందో బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆట ఆల‌స్యంగాలా ప్రారంభ‌మ‌య్యేలా ఉంద‌ని చెప్పింది. అయితే.. వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా ప్ర‌కారం ఈ రోజంతా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దీంతో మ్యాచ్ ఈ రోజు జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఇక వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు మ్యాచ్ పూర్తిగా ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే.

మ్యాచ్ ఎప్పుడు మొద‌లైయ్యేది తెలియ‌కపోవ‌డంతో ఆట‌గాళ్లు త‌మ వ్యాప‌కాల్లో మునిగిపోయింది. న్యూజిలాండ్ క్రికెట‌ర్లు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. మ‌రి కొంద‌రు ఆట‌గాళ్లు ముచ్చ‌ట్లు పెడుతుండగా.. మ‌రొకొంద‌రు ఆట‌గాళ్లు బాల్కానీల్లో కూర్చొని వేడి కాఫీని ఆస్వాధిస్తున్నారు.

Next Story
Share it