WWE స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూత
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ బ్రే వ్యాట్(36) కన్నుమూశాడు.
By Medi Samrat Published on 25 Aug 2023 3:08 PM ISTవరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ బ్రే వ్యాట్(36) కన్నుమూశాడు. గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారి "ట్రిపుల్ హెచ్" సోషల్ మీడియాలో వ్యాట్ మరణాన్ని ప్రకటించాడు. "మా WWE కుటుంబ సభ్యుడు బ్రే వ్యాట్ మరణించాడనే విచారకరమైన వార్త గురించి మాకు కాల్ వచ్చింది. వ్యాట్ ఊహించని విధంగా ఈరోజు కన్నుమూశారు. మా ఆలోచనలు అతని కుటుంబంతో ఉన్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వారి గోప్యతను గౌరవించాలని మేము కోరుతున్నామని ట్వీట్ చేశాడు
బ్రే వ్యాట్ అసలు పేరు విండ్‌హమ్ రోటుండా.. గత కొన్ని నెలలుగా WWE దూరంగా ఉన్న బ్రే వ్యాట్.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బ్రే వ్యాట్ 2009 నుండి WWEతో అనుబంధం కలిగి ఉన్నాడు. బ్రే వ్యాట్ 2021, 2022 సంవత్సరాలలో WWEలో కనిపించలేదు. బ్రే వ్యాట్ మరణవార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రే వ్యాట్ WWEలో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్. WWE ఛాంపియన్‌షిప్ ఒకసారి, యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ రెండుసార్లు సాధించాడు. బ్రే వ్యాట్ ఆగస్ట్ 2018 నుండి ఏప్రిల్ 2019 వరకు విరామం తీసుకున్నాడు. బ్రే వ్యాట్ మల్లయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతడి తండ్రి హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా, అతని తాత బ్లాక్‌జాక్ ముల్లిగాన్.. ప్రొఫెషనల్ రెజ్లర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అతని మేనమామలు బారీ, కెండల్ విండ్‌హామ్ కూడా రెజ్లింగ్ ప్రపంచంలో కెరీర్‌ను కొనసాగించారు.