రోహిత్‌ ముంబైని వీడటం పక్కా.. ధోనీ కథ వేరు: మాజీ క్రికెటర్

ఐపీఎల్ -2025 సీజన్‌కు చాలా టైమ్‌ ఉంది. కానీ.. ఇప్పటి నుంచే రాబోయే సీజన్‌ హాట్ టాపిక్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  12 Sept 2024 11:02 AM IST
రోహిత్‌ ముంబైని వీడటం పక్కా.. ధోనీ కథ వేరు: మాజీ క్రికెటర్

ఐపీఎల్ -2025 సీజన్‌కు చాలా టైమ్‌ ఉంది. కానీ.. ఇప్పటి నుంచే రాబోయే సీజన్‌ హాట్ టాపిక్ అవుతోంది. ఎవరు ఏ టీముల్లో ఉంటారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంగా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ టీమ్‌ను వీడుతున్నారంటూ చర్చ జరుగుతోంది. ఆయన వేలంలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారంటూ క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. అయితే.. 2024 సీజన్‌లో గుజరాత్‌ టీమ్‌ నుంచి హార్దిక్‌ ను వెనక్కి తీసుకొచ్చి.. ముంబై పగ్గాలు అతనికి ఇవ్వడంతో వివాదం మొదలైంది. రోహిత్ ఫ్యాన్స్ ముంబై ఫ్రాంచైజీపై పెద్ద ఎత్తున విమవర్శలు చేశారు. రోహిత్‌ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సీజన్‌లో పాయింట్ల పట్టిగలో అట్టడుగు స్థానంలో ఉండిపోయింది ముంబై ఇండియన్స్.

అయిత.. తాజాగా రోహిత్‌ ఐపీఎల్‌లో జట్టు మారడంపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర విషయాలు చెప్పారు. రోహిత్ శర్మ ముంబై టీమ్‌ను వీడటం ఖామయని అన్నారు. తన అభిప్రాయం మేరకు రోహిత్‌ శర్మ ఎట్టి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌లో ఆడడు అని చెప్పారు. ఇప్పుడు జట్టు రీటైన్ చేసుకునే వారు కనీసం మరో మూడేళ్ల పాటు అదే జట్టు తరఫున ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంటుందని అన్నారు. అందుకే రోహిత్‌ను ముంబై రిటైన్‌ చేసుకుంటుందా లేదా అన్నది డౌటే అన్నారు ఆకాశ్ చోప్రా. రోహిత్ మూడేళ్లు ఆడగలిగితేనే అతడిని ముంబై ఇండియన్స్‌ జట్టులోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఏ ఫ్రాంచైజీ అయినా ఇలానే ఆలోచిస్తుందని చెప్పారు. ఇక ఈ రూల్‌ మహేంద్రసింగ్ ధోనీకి మాత్రం వర్తించదు అన్నారు. ఎందుకంటే ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కి మధ్య ఉన్న కథ వేరు. బంధం వేరు అని ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ రోహిత్‌ శర్మను విడిచిపెట్టాలని చూస్తున్నట్లుగా ఉందన్నారు. రోహిత్ కూడా ముంబైని వీడేందుకు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్‌లో అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story