ఆస్ట్రేలియా దిగ్గ‌జ క్రికెట‌ర్ కిడ్నాప్‌.. న‌లుగురు అరెస్ట్

Former Australian Cricketer Stuart MacGill Kidnapped.ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు, లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2021 4:50 AM GMT
Stuart MacGill

ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు, లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. అత‌డిని కిడ్నాప్ చేసిన న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వారి వయ‌సులు 27,29,42, 46 ఉన్నట్లు తెలిపారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. 50 ఏళ్ల స్టువర్ట్ మెక్‌గిల్ గ‌త నెల (ఏప్రిల్‌) 14న సిడ్నీకి గంట ప్రయాణం దూరంలో ఉన్న తన ప్రాపర్టీ వద్దకు మెక్ గిల్ వెలుతున్నాడు. ఓ జంక్షన్ లో అటకాయించిన కిడ్నాపర్లు.. మరో వాహనంలో బలవంతంగా అతడిని తీసుకుని వెళ్లారు. ఓ బిల్డింగ్‌లో బందించారు. తీవ్రంగా కొట్ట‌డంతో పాటు గ‌న్ ను పాయింట్ బ్లాక్‌లో పెట్టి మ‌రీ బెదిరించారు. పెద్ద మొత్తంలో న‌గ‌దును డిమాండ్ చేశారు. అనంత‌రం.. ఓ గంట త‌రువాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారని న్యూసౌత్ వేల్స్ పోలీసు సూపరింటెండెంట్ ఆంటోనీ హోల్టన్ వెల్లడించారు.

కిడ్నాప‌ర్ల విడిపెట్ట‌డంతో.. మెక్‌గిల్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. మెక్ గిల్ కు తెలిసిన ఓ వ్యక్తి కిడ్నాపర్లలో ఒకరని గుర్తించి.. అత‌డిని గుర్తించి వేట ప్రారంభించామని, దాదాపు 20 రోజుల తరువాత నిందితులందరినీ అరెస్ట్ చేశామని, వీరంతా 27 నుంచి 46 ఏళ్ల మధ్య వయసున్న వారని తెలిపారు. కిడ్నాప్ చేసిన వారు డబ్బులను డిమాండ్ చేసినా, వారికి ఎటువంటి ప్రతిఫలమూ అందలేదని స్పష్టం చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలోనే మెక్‌గిల్ కూడా అరంగేట్రం చేశాడు. అత‌నితో పోటీ ప‌డి వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున 44 టెస్టులు ఆడి 208 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 3 వ‌న్డేలు మాత్ర‌మే ఆడిన ఈ క్రికెట‌ర్ 6 వికెట్లు తీశాడు.
Next Story
Share it