అప్పుడు విమానం బాత్‌ రూమ్ లో నిర్బంధించారు.. ఇప్పుడు అరెస్ట్.. ఆ క్రికెట్ లెజెండ్ వివాదాల పుట్ట

Former Australian Cricketer Michael Slater Arrested. సిడ్నీ, డిసెంబరు 15, ఈ ఏడాది అక్టోబర్‌లో వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడిన

By Medi Samrat  Published on  15 Dec 2021 6:58 PM IST
అప్పుడు విమానం బాత్‌ రూమ్ లో నిర్బంధించారు.. ఇప్పుడు అరెస్ట్.. ఆ క్రికెట్ లెజెండ్ వివాదాల పుట్ట

సిడ్నీ, డిసెంబరు 15, ఈ ఏడాది అక్టోబర్‌లో వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మైఖేల్ స్లేటర్ అరెస్టయ్యాడు. ఓ మహిళకు పలు టెక్స్ట్ మెసేజ్‌లు పంపి, ఫోన్‌లు చేశాడనే ఆరోపణల కారణంగా మైఖేల్ స్లేటర్ అరెస్టు అయ్యాడు. న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఫిర్యాదుదారుకు మైఖేల్ స్లేటర్ ఎన్నో సందేశాలు, ఫోన్ కాల్స్ చేసి ఇబ్బందులు పెట్టినట్లు తేలింది.

స్లేటర్ వీడియో లింక్ ద్వారా మ్యాన్లీ లోకల్ కోర్ట్‌లో హాజరయ్యాడు. అక్టోబరులో కూడా స్లేటర్ మూడు సంవత్సరాల పాటు తన భాగస్వామిని "వెంబడించడం/బెదిరించడం" అనే అభియోగాలపై కోర్టుకు హాజరయ్యాడు. అప్పట్లో సిడ్నీకి ఉత్తరాన ఉన్న మ్యాన్లీలోని అతని ఇంటిలో అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు మరోసారి కూడా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్టర్న్ సబర్బ్స్ పోలీస్ ఏరియా కమాండ్, NSWకి అనుబంధంగా ఉన్న అధికారులు స్లేటర్‌ను అరెస్టు చేసి మ్యాన్లీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధితురాలికి స్లేటర్ 66 మెసేజీలు, 18 కాల్స్ చేసి బెదిరింపులకు దిగినట్లు తేలింది.

స్లేటర్ ఆస్ట్రేలియా గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. 8 సంవత్సరాల కెరీర్‌లో 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. గత 15 సంవత్సరాలుగా కామెంటేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను చాలా కాలంగా భార్యతో విడిపోయాడు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతడిపై ఆరోపణలు గుప్పించింది. 2001 సంవత్సరంలో యాషెస్ సిరీస్ అతని చివరి సిరీస్‌. స్లేటర్ వివాదాలలో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. ఇద్దరు స్నేహితురాలతో గొడవ కారణంగా స్లేటర్ ను విమానం నుంచి కిందకు దించేశారు. సిడ్నీ నుంచి క్వాంటాస్ విమానంలో వాగాకు ఇద్దరు మహిళా స్నేహితులు కలిసి ప్రయాణిస్తూ గొడవపడ్డాడు. దీంతో అతన్ని విమానంలోని బాత్‌రూమ్‌లో బంధించారు. ఈ కారణంగా విమానం టేకాఫ్‌లో జాప్యం జరిగింది. ఈ కారణంగా అతడిని విమానం నుంచి కిందకు దించారు. ఇక సోషల్ మీడియాలో కూడా స్లేటర్ పలు వివాదాస్పద కామెంట్లు చేశాడు.


Next Story