ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ బ్రియాన్ బూత్ (89) కన్నుమూశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ అయిన బూత్ ఆస్ట్రేలియా తరుపున మొత్తం 29 టెస్టులు ఆడి 1773 పరుగులు చేశాడు. బౌలర్‌గా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. బ్రియాన్ బూత్ కెరీర్‌లో ఐదు సెంచరీలు, పది అర్ధ సెంచరీలు చేశాడు. ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు 169 పరుగులు. దక్షిణాఫ్రికాపై ఆయన ఈ స్కోరు నమోదుచేశాడు. బ్రియాన్ బూత్ క్రికెట్‌లోకి రాకముందు 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో హాకీలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో ది క్రికెట్ మంత్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బూత్ "రెండు క్రీడలు ఆడగలగడం తన అదృష్టం" అని చెప్పాడు. బ్రియాన్ బూత్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.