బ్రెజిల్ పుట్‌బాల్ దిగ్గజం పీలే మరోసారి ఆస్పత్రిలో చేరారు. గతంలో గుర్తించిన పెద్దప్రేగు కణితి చికిత్స కోసం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యబృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వైద్య బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. మూడుసార్లు ప్రపంచ కప్ విజేత అయిన 81 ఏళ్ల పీలే గత సంవత్సరం కాలం నుంచి పెద్దపేగు కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో సెప్టెంబర్ 4న కణితికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన నెలరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. అనంతరం డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఇంటి వద్ద ఉంటూనే కీమోథెరపీని కొనసాగిస్తున్నారు.
కాగా.. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికి పీలే సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్నాడు. ఇటీవల తన ఏడవ బాలన్ డి'ఓర్ గెలుచుకున్నందుకు లియోనెల్ మెస్సీని అభినందించాడు. తోటి ఆటగాడు డియోగొ మారడోనా మరణించి ఏడాది అయిన సందర్భంగా అతడికి నివాళులర్పించాడు. ఇక అంతర్జాతీయ పుల్‌బాల్ కెరీర్‌లో పీలే 77 గోల్స్ సాధించారు. ఇప్పటికి కూడా టాప్ 10 జాబితాలో పీలే ఉన్నాడు. ఇక బ్రెటిల్ పుల్‌బాల్ కెప్టెన్‌గా మూడు సార్లు తన జట్టుకు ప్రపంచకప్(1958,1962,1970)ను అందించారు.