కుల్‌దీప్ యాదవ్ మహ్మద్ సిరాజ్ ల మధ్య గొడవ.. వీడియో వైరల్
Fight between Mohammed Siraj and Kuldeep Yadav.టీమ్ఇండియా డ్రెసింగ్ రూమ్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2021 12:15 PM IST
టీమ్ఇండియా డ్రెసింగ్ రూమ్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ల మధ్య గొడవ జరుగుతున్నట్లు ఉంది. దీంతో ప్లేయర్స్ మధ్య అంతా బాగానే ఉందా..? లేక ఏమైన గొడవలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు ఆట ముగిసిన తర్వాత భారత క్రికెటర్లను అభినందించడానికి మహ్మద్ సిరాజ్ డ్రెస్సింగ్ రూమ్ డోర్ వద్ద నిల్చున్నాడు. అతని పక్కనే టీమ్ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఉన్నాడు. జట్టును మొత్తం అభినందించిన సిరాజ్.. కుల్దీప్ రాగానే అతన్ని ఆపి మెడ పట్టుకొని గొడవ పడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే.. ఈ ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో మైదానంలో డ్రింక్స్ అందించారు.
లంచ్ సెషన్ తర్వాత అశ్విన్‌కి కాసేపు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వెళ్లిన సిరాజ్ ఆ తర్వాత మైదానం వెలుపలికి వచ్చినప్పటికి డ్రింక్స్ బాయ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అన్న సందేహాం వ్యక్తం అయింది. నిజానికి సిరాజ్, కుల్దీప్‌ల మధ్య ఎటువంటి గొడవ చోటుచేసుకోలేదు. తుది జట్టులో ఇద్దరికి చోటు లేకపోవడంతో ఉదయం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకున్నారు. అయితే టీ విరామం సమయంలో కుల్దీప్‌తో సిరాజ్ గొడవ పడుతున్నట్లుగా 'యానిమేటర్ వీడియో' ద్వారా చిన్న తమాషా చేశాడు. వీడియోలో చూస్తే సిరాజ్.. కుల్దీప్‌ను సీరియస్‌గా ఏదో అంటున్నట్లు కనిపిస్తుంది. కుల్దీప్‌కు మొదట సిరాజ్ చర్య అర్థం కాకపోయినా.. అతని తీరు చూసి భయపడినట్లుగా వీడియో కనిపించింది. రవిశాస్త్రి అక్కడే ఉండడం, వీరిని చూసి కూడా ఏమి పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇదంతా కావాలని చేసినట్లు తెలుస్తుంది.