ముంబై వర్సెస్ చెన్నై ఐపీఎల్.. ఎల్ క్లాసికోకు సిద్ధమా..?

Fans Pumped Up For 'El Clasico' Of IPL As Arch-rivals MI-CSK Renew Rivalry On Saturday. ఎల్ క్లాసికో.. ఐపీఎల్ కు సంబంధించి ఈ పేరు వింటే చాలు..

By Medi Samrat  Published on  1 May 2021 5:30 PM IST
ముంబై వర్సెస్ చెన్నై ఐపీఎల్.. ఎల్ క్లాసికోకు సిద్ధమా..?

ఎల్ క్లాసికో.. ఐపీఎల్ కు సంబంధించి ఈ పేరు వింటే చాలు.. అది ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అని అందరికీ అర్థం అవుతుంది. శనివారం నాడు జరగబోయే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. రెండు జట్లు సమ ఉజ్జీలు అయినప్పటికీ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ లో ఉంది. చెన్నై పిచ్ పై జరిగిన మ్యాచ్ లలో ఊహించని షాక్ లు తిన్న ముంబై ఇండియన్స్ ఢిల్లీ పిచ్ పై మంచి ఆట తీరును కనిపించింది. ఓపెనర్ డికాక్ కూడా టచ్ లోకి రావడంతో ముంబై ఇండియన్స్ ఊపిరి పీల్చుకుంది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ముంబై ఆరు మ్యాచ్ లలో మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. చెన్నై తన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ని ఓడించగా.. రాజస్థాన్‌పై ముంబై విజయాన్ని అందుకుంది.

గతేడాది చెన్నై ఎంతో ఘోరమైన ప్రదర్శనను కనబర్చిన సంగతి తెలిసిందే..! ఈ ఏడాది మాత్రం సూపర్ కింగ్స్.. సూపర్ విజయాలతో దూసుకుపోతూ ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై మీద గెలిచి నంబర్ వన్ ను పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్ అలీ, సురేష్ రైనా ఫామ్ లో ఉన్నారు. అంబటి రాయుడు, కెప్టెన్ ఎంఎస్ ధోనీ ల ఇన్నింగ్స్ లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇక రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ కరన్ ఆకట్టుకుంటూ ఉన్నాడు. లోతైన బ్యాటింగ్ లైనప్ తో పాటూ పటిష్టమైన బౌలింగ్ లైనప్ చెన్నై సొంతం.

ఇక ముంబై ఇండియన్స్.. పేపర్ మీద జట్టు ఎంతో స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉన్నా.. ఆ జట్టు చేస్తున్న పొరపాట్ల కారణంగా చేతులెత్తేస్తూ ఉంది. అయితే ఢిల్లీలో మ్యాచ్ లు ఆ జట్టు ఫేట్ ను మార్చబోతున్నాయని అంచనా వేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా.. డికాక్ టచ్ లోకి వచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ కు మంచి ఆరంభాలు దొరుకుతూ ఉన్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ ఈ మ్యాచు లో ఆడడం డౌటే.. హార్దిక్ పాండ్యా ఇంకా తనకున్న ఇమేజ్ కు తగ్గ ప్రదర్శన చేయలేదు. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలు పర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్‌లో స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లు పవర్ ప్లే ఓవర్లలో వికెట్లను పడగొట్టలేకపోతున్నారు. అయితే పెద్దగా పరుగులు ఇవ్వకపోవడం కొంచెం ప్లస్ పాయింట్. మూడో పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ కు అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తున్నారు. స్పిన్నర్ రాహుల్ చహర్ ఒక్కడే బౌలింగ్ లో బాగా రాణిస్తున్నాడు. కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్ లలో నిలకడ లేకుండా పోయింది. ఇక ఈ రోజు మ్యాచ్ లో ఎవరు రాణిస్తారో చూడాలి. ఐపీఎల్ లో ఈ సీజన్ లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.


Next Story