భర్తను బావ అంటూ పిలిచిన ఫ్యాన్స్.. వీడియో షేర్ చేసిన సానియా
Fans call Shoaib Malik jija ji during India vs Pakistan Match.భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే మ్యాచ్ గురించే కాదు
By తోట వంశీ కుమార్ Published on
26 Oct 2021 7:42 AM GMT

భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే మ్యాచ్ గురించే కాదు సానియా మీర్జా-షోయబ్ మాలిక్ జంట గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. ఒక్కోసారి రచ్చ కూడా అవుతుంది. ఇక ఆదివారం జరిగిన పోరులో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో భారత ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తుండగా.. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారతను ఓడించడంతో పాక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా బ్యాటింగ్ చేసే సమయంలో పాక్ ఆటగాడు, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
షోయబ్ మాలిక్‌ను ఉద్దేశించి కొందరు అభిమానులు 'జీజా జీ.. జీజా జీ (బావ గారు.. బావగారూ )' అని పిలిచారు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 4లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా.. ఈ వీడియోను రీ షేర్ చేసిన సానియా మీర్జా.. స్మైలింగ్ ఎమోజీలతో పాటు రెండు హార్ట్ సింబల్స్‌ను కూడా జతచేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
201లో సానియా-షోయబ్ పెళ్లి చేసుకోగా.. 2018లో వీరికి కుమారుడు జన్మించాడు.
Next Story