హార్ధిక్ పాండ్యా నీకిది త‌గ‌దు.. నెటీజ‌న్ల మండిపాటు

Fans Accuse Hardik Pandya of Abusing Mohammed Shami.గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాపై నెటీజ‌న్లు ఆగ్ర‌హం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 1:13 PM IST
హార్ధిక్ పాండ్యా నీకిది త‌గ‌దు.. నెటీజ‌న్ల మండిపాటు

గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాపై నెటీజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హార్థిక్‌లో కెప్టెన్సీ ల‌క్షణాలు లేవ‌ని, సార‌ధివి కాగానే అలా చేస్తావా అంటూ నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. త‌న కంటే సీనియ‌ర్ ఆట‌గాడైన మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి క‌నీసం గౌర‌వం ఇవ్వ‌కుండా అత‌డిపై చిందులు తొక్క‌డ‌మే అందుకు కార‌ణం. గ‌త రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ల‌క్ష్యాన్ని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19.1 ఓవ‌ర‌ల్లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైజ‌ర్స్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్‌(57; 46 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స‌ర్లు) గుజరాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఈ ఓవ‌ర్‌లో విలియ‌మ్ స‌న్.. రెండు, మూడో బంతుల‌ను భారీ సిక్స‌ర్లలుగా మ‌లిచాడు.. చివ‌రి బంతిని పాండ్యా బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌గా వేయ‌గా.. రాహుల్ త్రిపాఠి(17 రిటైర్డ్ హ‌ర్ట్ 11 బంతుల్లో 1పోర్, 1 సిక్స్‌) అప్ప‌ర్ క‌ట్ ఆడాడు. డీప్ థ‌ర్డ్ మ్యాన్ ఫీల్డింగ్ చేస్తున్న ష‌మీ క్యాచ్ అందుకోలేక‌పోయాడు. క్యాచ్ అందుకోక‌పోయినా బంతి బౌండ‌రీకి వెళ్ల‌కుండా అడ్డుకున్నాడు. క్యాచ్ ప‌ట్ట‌క‌పోవ‌డంతో పాండ్యా.. ష‌మీపై గ‌ట్టిగా అరిచాడు. అది లైవ్‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో నెటీజ‌న్లు పాండ్యాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ ఆట‌గాడైన ష‌మీకి క‌నీస గౌర‌వం ఇవ్వాల‌ని, ఇలాగే స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల ప‌ట్ల ప్ర‌వ‌ర్తిస్తే జ‌ట్టులో ఎవ‌రూ ఉండ‌ర‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ల‌క్ష్యాన్ని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19.1 ఓవ‌ర‌ల్లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైజ‌ర్స్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్‌(57; 46 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స‌ర్లు) గుజరాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.


Next Story