ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022 పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని జట్లు పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో స్టేడియాలకు వెలుతున్నారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితమే మ్యాచ్‌లు జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను ఖతార్ నిషేదించింది. అంతేకాకుండా అభిమానులు కూడా స్టేడియంలోకి మద్యం తీసుకువెళ్లకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ నిర్ణయం పలువురు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. మీరు చెబితే మేము వింటామా అంటూ దొంగదారిలో మద్యాన్ని మైదానంలోకి తీసుకువెలుతూ ఇప్పటికే పలువురు పట్టుబట్టారు. తాజాగా ఓ అభిమాని ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటుందని ఏకంగా బైనాక్యులర్‌లో మద్యం తీసుకువచ్చాడు. అతడు ఎంత తెలివిగా ఆలోచిస్తేనేం.. సెక్యూరిటీ చెకప్‌లో దొరికిపోయాడు.
బైనాక్యులర్ మద్య బాగంలో చిన్న డబ్బాను ఏర్పాటు చేసుకుని అందులో మద్యం తీసుకువచ్చాడు. చెకింగ్ సమయంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యులర్స్ లెన్స్ తీశాడు. బైనాక్యులర్‌లో ఏదో ద్రవం ఉన్నట్లు గుర్తించాడు. ఇదేంటనీ అడిగితే హ్యాండ్ శానిటైజర్ అని అతడు చెప్పినా ఆల్కహాల్ అని గుర్తించారు.