భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ లలో ఓడిపోతే ఆ తర్వాత వచ్చే విమర్శలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా అదే విధమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓటమిని చవిచూసిన తర్వాత బాబర్ అజామ్ కెప్టెన్సీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ప్రశ్నలు సంధించాడు. బాబర్ మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాడని, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మాలిక్ సూచించాడు.
"ప్రెజర్ సిచ్యువేషన్ లో సీనియర్ ప్లేయర్ల మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కెప్టెన్సీ కష్టంగా అనిపిస్తే వదిలేయడం బెటర్. ఎందుకంటే టెన్షన్ లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక సీనియర్ ఆటగాడు ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్‌కి మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కూడా జట్టును నడిపించలేకపోతే, కెప్టెన్సీని వదిలివేయాలి. మళ్ళీ అదే తప్పులు చేస్తే ఏమి లాభం. చాలా మంది ఆటగాళ్లు కూడా కెప్టెన్సీని వదులుకున్నారు" అని మాలిక్ అన్నాడు.