లైంగిక వేధింపుల ఆరోపణలను ధృవీకరించిన‌ క్రికెట‌ర్‌.. స్వ‌దేశానికి ప‌య‌నం

Ex-Nepal captain Sandeep Lamichhane says he will surrender to authorities. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొనేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు

By Medi Samrat  Published on  1 Oct 2022 3:30 PM GMT
లైంగిక వేధింపుల ఆరోపణలను ధృవీకరించిన‌ క్రికెట‌ర్‌.. స్వ‌దేశానికి ప‌య‌నం

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొనేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు సందీప్ లామిచానే ధృవీకరించాడు. ఖాట్మండులోని ఒక హోటల్ గదిలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీపీఎల్‌లో ఆడుతున్న నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు దేశానికి తిరిగి వస్తున్నట్లు చెప్పాడు. అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అధికారులు అతనిని తక్షణమే సస్పెండ్ చేశారు.

ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో, 21 ఏళ్ల సందీప్.. అక్టోబర్ 6 న నేపాల్‌కు తిరిగి వస్తానని.. అధికారులకు లొంగిపోయి న్యాయ పోరాటం చేస్తానని చెప్పాడు. తాను నిర్దోషినని, దేశ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పునరుద్ఘాటించారు. "With great hope and strength, I hereby confirm that I am reaching to my home country, Nepal on this 6th October 2022 and will submit myself to the authority of Nepal to fight a legal battle against false allegation.""I hereby reiterate that I am INNOCENT and I have complete non-shaken faith in justice system. I firmly believe over all the law enforcement authorities and honorable courts on their fair trial and adjudication and I am just hopeful to get justice at the earliest. My dear well wishers I assure you all that I am innocent and I have not wronged you. I have recovered from unpleasant situation I went through and I have prepared myself to go through this ordeal to prove myself innocent and victim of conspiracy. I am sure all wrongful allegation charged against me will be unfolded by the span of time," అంటూ సందీప్ పోస్టు పెట్టాడు.


Next Story