కరోనా విరామం తరువాత భారత గడ్డపై చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తరువాత పితృత్వపు సెలవులు తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టులోకి నదీమ్, వాషింగ్టన్ సుందర్‌లు వచ్చారు. ఇక రూట్‌కు తన కెరీర్‌లో ఇది వందో టెస్ట్. ఈ మ్యాచ్‌లో గెలిచి తన శతక టెస్టు మ్యాచ్‌ను మధురానుభూతిగా మార్చుకోవాలని రూట్ భావిస్తున్నాడు. ప్రస్తుతం రూట్ పుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో ఓ డబుల్ సెంచరీ, మరో భారీ శతకంతో ఇంగ్లాండ్ కు సిరీస్ సాధించి పెట్టాడు. అదే ఫామ్‌ను టీమ్ఇండియాతో సిరీస్‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత సిరీస్ విజయాన్ని సాధించిన భారత జట్టు.. అత్యంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే.. ఇంగ్లాండ్‌తో సిరీస్ గెలవడం తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఘనంగా బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ దుర్బేద్యంగా మారనుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానే, పంత్, సుందర్, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షాబాజ్ నదీమ్
ఇంగ్లాండ్ జట్టు : బర్న్స్, సిబ్లీ, లారెన్స్, రూట్(కెప్టెన్), స్టోక్స్, ఓలీ పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, జాక్ లీచ్, అండర్సన్