భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుండగా.. తొలి రెండు టెస్టుల కోసం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అంతేకాకుండా ఆరుగురు రిజర్వు ఆటగాళ్లను ఎంపిక చేసింది. విధ్వంసకర ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులో చేరారు.
కాగా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్య వహిస్తున్న ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలన్న విధానంతో స్టోక్స్, ఆర్చర్ ను లంక సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇక ఫిట్‌నెస్ సాధించిన వెంటనే ఒలీప్ పోప్ కూడా భారత్‌కు వస్తాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాక్ సిరీస్‌లో అతడి భుజానికి గాయమైంది. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులో రావడంతో ఆ జట్టు బలం పెరిగింది. జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. కరోనా బారినపడి కోలుకొన్న మొయిన్ అలీకి టీమ్‌లో చోటుదక్కింది. చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టులు జరుగనున్నాయి.
ఇంగ్లండ్ జట్టు: జో రూట్(కెప్టెన్), రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, జాక్ క్రావ్లే, ఒల్లీ స్టోన్, జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, డామ్ బెస్, డాన్ లారెన్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్.
రిజర్వు ఆటగాళ్లు: జేమ్స్ బ్రాసీ, మాసోన్ క్రేన్, సకీబ్ మహమూద్, మాట్ పార్కిన్సన్, ఒల్లీ రాబిన్సన్, అమర్ విర్ది.