'ఈ విజయం చనిపోయిన నా సోదరికి అంకితం'.. ఇషాన్ కిషన్ భావోద్వేగం
అహ్మదాబాద్‌లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన రాత్రి యావత్ భారత్ పండగ చేసుకుంటుంటే, యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం...
By - అంజి |
'ఈ విజయం చనిపోయిన నా సోదరికి అంకితం'.. ఇషాన్ కిషన్ భావోద్వేగం
అహ్మదాబాద్‌లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన రాత్రి యావత్ భారత్ పండగ చేసుకుంటుంటే, యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం కన్నీళ్లను ఆపుకుంటూ దేశం కోసం పోరాడాడు. ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందే తన సోదరి (కజిన్) రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఇషాన్ వెల్లడించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఇషాన్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే, మ్యాచ్‌కు ముందు రోజు నేను నా సోదరిని కోల్పోయాను. ఆమె జ్ఞాపకార్థమే ఈ మ్యాచ్ ఆడాను. హార్దిక్ భాయ్‌తో మాట్లాడాను, జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ధైర్యం చెప్పారు. ఈ విజయాన్ని నేను ఆమెకే అంకితం ఇస్తున్నాను. ఈ రోజు మహిళా దినోత్సవం కూడా కావడంతో ఈ విజయం నాకు మరింత ప్రత్యేకం" అని ఎంతో భావోద్వేగంగా చెప్పాడు.
ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో 193.29 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌తోనే కాకుండా రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్‌ల క్యాచ్‌లను అద్భుతంగా అందుకుని కివీస్ పతనాన్ని శాసించాడు. విరాట్ కోహ్లీ నుంచి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని, అలాగే వరల్డ్ కప్ జట్టు ఎంపికకు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని ఇషాన్ పేర్కొన్నాడు.