ఇద్దరు యువ కెరటాల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో 18 ఏళ్ల బ్రిటీష్ యురకెరటం ఎమ్మా రదుకా విజయం సాధించింది. పైనల్‌లో కెనడాకు చెందిన 19 ఏళ్ల లైలా ఫెర్నాండెజ్‌ను మట్టికరిపించింది. 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. దీంతో యూఎస్ ఓపెన్ చరిత్రలో గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిపైయర్‌గా ఎమ్మా రదుకా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. 44 ఏళ్ల తరువాత గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన బ్రిటిష్ మహిళగా రికార్డు సృష్టించింది. అంతకుముందు 1977లో వర్జీనియా వేడ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.
150వ ర్యాంకర్ అయిన ఎమ్మా 73వ ర్యాంకర్ అయిన లెలాను ఓడించడం విశేషం. ఇక ఎమ్మా టోర్నీలో ఒక్క సెట్‌ను కూడా కోల్పోకుండా గెలుపొందడం గమనార్హం. తొమ్మిది మ్యాచ్‌ల్లో 20 సెట్లలోనూ గెలిచింది. ట్రోఫీతోపాటు ఎమ్మాకు 2.5 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. తాజా గెలుపుతో ఆమె 150 ర్యాంకు నుంచి అమాంతం 23కి ఎగబాకింది. ప్రస్తుతం బ్రిటన్ నెంబర్ వన్ క్రీడాకారిణీ ఎమ్మానే.