స్టార్ ఆట‌గాళ్లు కెప్టెన్లుగా ఆ టోర్నీకి నాలుగు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం దులీప్ ట్రోఫీ 2024-2025 మొదటి రౌండ్‌కు జట్లను ప్రకటించింది.

By Medi Samrat  Published on  14 Aug 2024 12:58 PM GMT
స్టార్ ఆట‌గాళ్లు కెప్టెన్లుగా ఆ టోర్నీకి నాలుగు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం దులీప్ ట్రోఫీ 2024-2025 మొదటి రౌండ్‌కు జట్లను ప్రకటించింది. టోర్నీకి కెప్టెన్‌లుగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌లు నియమితులయ్యారు. దులీప్ ట్రోఫీ 2024-2025 సెప్టెంబర్ 5, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో టోర్నీ జరగనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వెటరన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడరు.

శ్రేయాస్ అయ్యర్ ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా భారత టెస్టు జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉంది. అతను ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతని ప్రదర్శన ఆశాజ‌న‌కంగా లేదు. ఆ తర్వాత బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో కూడా అతనికి చోటు దక్కలేదు.

టీమ్‌- ఎ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ర్యాన్ పరాగ్, ధృవ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కవేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.

టీమ్- B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్).

టీమ్- సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇందర్‌జీత్, హృతిక్ షౌకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, విశాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు మర్కండే, హిమాన్షు మర్కండే, (వికెట్ కీపర్), సందీప్ వారియర్.

టీమ్ డి: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైదే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్‌పాండే, (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.

Next Story