Video : ఛీ ఛీ.. పిలవని పేరంటానికి వెళ్లిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్‌లకు దుబాయ్‌లోని ఓ కేరళ పూర్వ విద్యార్థుల సంఘం ఆతిథ్యమివ్వడం వివాదాస్పదమైంది.

By Medi Samrat
Published on : 31 May 2025 4:58 PM IST

Video : ఛీ ఛీ.. పిలవని పేరంటానికి వెళ్లిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్‌లకు దుబాయ్‌లోని ఓ కేరళ పూర్వ విద్యార్థుల సంఘం ఆతిథ్యమివ్వడం వివాదాస్పదమైంది. కొచ్చిన్ యూనివర్సిటీ బీటెక్ పూర్వ విద్యార్థుల సంఘం (కుబా) దుబాయ్‌లోని పాకిస్థాన్ అసోసియేషన్ లో గతవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిపై భారీ విమర్శలు వచ్చాయి.

మే 25న తాము కార్యక్రమం నిర్వహిస్తున్న అదే ప్రాంగణంలో మరో కార్యక్రమంలో భాగంగా పాక్ క్రికెటర్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం వచ్చారని తెలిపింది. తమ కార్యక్రమం ముగిసే సమయంలో అఫ్రిది, గుల్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఆహ్వానం లేకుండానే తమ వేదిక వద్దకు వచ్చారని తెలిపారు. తమ ఆర్గనైజింగ్ టీమ్ సభ్యులు గానీ, అధికారులు గానీ, పూర్వ విద్యార్థులు గానీ వారిని ఆహ్వానించలేదని ప్రకటనలో తెలిపారు.


Next Story