వారిని జట్టు నుండి పీకేయండి : అఫ్రీది

పాకిస్థాన్ జట్టు దారుణ ఓటమి ఆ దేశ మాజీ క్రికెటర్లు సహించలేకపోతున్నారు. ముఖ్యంగా కనీసం పోటీ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

By -  Medi Samrat
Published on : 16 Feb 2026 12:49 PM IST

వారిని జట్టు నుండి పీకేయండి : అఫ్రీది

పాకిస్థాన్ జట్టు దారుణ ఓటమి ఆ దేశ మాజీ క్రికెటర్లు సహించలేకపోతున్నారు. ముఖ్యంగా కనీసం పోటీ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొలంబోలో భారత్‌తో జరిగిన ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ జట్టులోని సీనియర్ ప్లేయర్లపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది విరుచుకుపడ్డాడు. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను మిగిలిన T20 ప్రపంచ కప్ మ్యాచ్ ల సమయంలో బెంచ్‌ పై ఉంచాలని పిలుపునిచ్చాడు. పదే పదే వైఫల్యం అవుతున్న వీరిని కాదని, కొత్త యువకులకు సరైన అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అన్నాడు.

"ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తే, నేను షహీన్‌ను కూడా బయట కూర్చోబెడతాను, బాబర్‌ను, షాదాబ్‌ను కూడా జట్టులో ఉంచను. నేను కొత్త అబ్బాయిలను ఆడిస్తాను, యువకులకు అవకాశం ఇస్తాను. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో యువతకి మద్దతు ఇస్తాను, వారికి ఆత్మవిశ్వాసం వచ్చేలా చేయడమే కాకుండా జట్టులో కూడా ఆడిస్తాను ”అని అఫ్రిది అన్నాడు. మనం ఈ ఆటగాళ్లను చాలా కాలంగా గమనిస్తున్నాం. వారికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రతిసారీ వారు మంచి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నాము. సీనియర్ ఆటగాళ్ళు. వారు మంచి ప్రదర్శన ఇవ్వకపోతే, బెంచ్ మీద కూర్చున్న జూనియర్లను ఎందుకు ఆడించకూడదు? ఏమైనా పెద్ద తేడా అయితే కనిపించదని తెలిపాడు షాహిద్ అఫ్రీది.

Next Story