గుజరాత్ టైటాన్స్ మిస్టరీ గర్ల్‌ ఎవరో తెలుసా.?

Do you know who is the mystery girl of Gujarat Titans. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ మెరుస్తూనే ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఇప్పటి వరకు

By Medi Samrat  Published on  21 April 2023 7:30 PM IST
గుజరాత్ టైటాన్స్ మిస్టరీ గర్ల్‌ ఎవరో తెలుసా.?

గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ మెరుస్తూనే ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో.. రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. అయితే.. గుజరాత్ టైటాన్స్ మిస్టరీ గర్ల్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. హార్దిక్ బృందంలోని మిస్టరీ గర్ల్ ఎవరో మీకు తెలుసా?.

గుజరాత్ టైటాన్స్ మిస్టరీ గర్ల్ పేరు తన్వీ షా. ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తన్వీ షా వృత్తిరీత్యా టెన్నిస్ క్రీడాకారిణి. భారత అండర్-16 మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఆమె అగ్రస్థానాన్ని సాధించింది. 2000 సంవత్సరంలో, తన్వీ షా జూనియర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. గతేడాది అబుదాబి టీ10 లీగ్‌కు యాంకరింగ్ చేసి అందరినీ ఆకట్టుకుంది.

ఈ సంవత్సరం ఐపీఎల్‌-2023లో గుజరాత్ టైటాన్స్ యాంకర్‌గా.. తన ప్రతిభతో, గ్లామర్‌తో క్రికెట్ అభిమానులను వెర్రివాళ్లను చేసింది తన్వి. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి మాత్ర‌మే కాదు. టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌ను కూడా హోస్ట్ చేసింది. అందులో ఆమె లియాండర్ పేస్ వంటి గొప్పవారిని ఇంటర్వ్యూ చేసింది. తన్వీ షా తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమెకు యోగా చేయడం, జిమ్‌లో వ్యాయామం చేయడం చాలా ఇష్టం.


Next Story