ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్‌సీడ్‌గా బరిలో దిగిన నొవాక్ జకోవిచ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ప్రపంచ నాలుగో ర్యాంకర్, రష్యన్ స్టార్ ప్లేయర్ మెద్వెదెవ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరు కనబర్చి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తొలిసెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా.. తదుపరి రెండు సెట్లలో మాత్రం జకోవిచ్ పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించాడు. 7-6, 6-2, 6-2 తేడాతో ఘన విజయం సాధించి కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ ను సొంతం చేసుకున్నాడు.
గత మూడుసార్లుగా వరుస టైటిల్స్‌ను సొంతం చేసుకుంటున్న జకోవిచ్‌కు.. ఇది ఓవరాల్‌గా 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. అంతకుముందు 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020లలో టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జాబితా విషయానికొస్తే.. జకోవిచ్ మరో రెండు టైటిళ్లు గెలిస్తే ఫెదరర్, నాదల్ సరసన చేరుతాడు. ఫెదరర్, నాదల్ చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచి టాప్‌లో ఉన్నారు.