క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. ఆ మ్యాచ్ లను కూడా ఉచితంగా చూసేయొచ్చు

Disney+ Hotstar Now Free For Mobile Users To Watch Asia Cup And ICC Men’s Cricket World Cup. క్రికెట్ లవర్స్‌కి డిస్నీ+హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్, ఆసియా కప్ మ్యాచ్ లను ఫ్రీగా చూడొచ్చని తెలిపింది.

By Medi Samrat  Published on  9 Jun 2023 4:00 PM IST
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. ఆ మ్యాచ్ లను కూడా ఉచితంగా చూసేయొచ్చు

క్రికెట్ లవర్స్‌కి డిస్నీ+హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్, ఆసియా కప్ మ్యాచ్ లను ఫ్రీగా చూడొచ్చని తెలిపింది. క్రికెట్ ఎంటర్టైన్ మెంట్ ను వీలైనంత మందికి చేర్చాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొబైల్ వీక్షకులకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తోంది. ఇండియాలో 540 మిలియన్లకు పైగా ఉన్న స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు ఈ రెండు మెగా టోర్నమెంట్లను ఉచితంగా వీక్షించే అవకాశం లభించనుంది. మొబైల్ తో పాటు, ట్యాబ్‌‌లలో చూసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టొబర్ 5న వరల్డ్ కప్ ప్రారంభమై నవంబర్ 19 వరకు కొనసాగనుంది. 10 దేశాలు తలపడనున్న ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో ఆసియా కప్ ప్రారంభం కానుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ ఆసియా కప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ రెండింటినీ మొబైల్ ఫోన్ వినియోగదారులందరికీ ఉచితంగా వీక్షించేలా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. IPL 2023లో రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్ దక్కించుకుంది జియో సినిమా. ఇక వరల్డ్ కప్ సమయంలో ఆ స్థాయిలోనే వ్యూయర్ షిప్ ఉండొచ్చు. దీంతో డిస్నీ+ హాట్‌స్టార్ ఈ రెండు సిరీస్ ల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ తో ముందుకు వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ వినియోగదారుల కోసం పేవాల్‌ను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ను భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో మొబైల్ వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఈ ఐడియాతో ముందుకు వచ్చింది డిస్నీ+ హాట్‌స్టార్. ఆసియాకప్ తో పాటు ఐసీసీ ఈవెంట్ల బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ హాట్ స్టార్ వద్ద ఉన్నాయి.


Next Story