చిక్కుల్లో ప‌డ్డ దినేశ్ కార్తిక్‌.. 'బ్యాట్ల‌ను ప‌రాయి పురుషుల భార్య‌ల‌తో'

Dinesh Karthik says Bats Are Like Neighbour’s Wife.భార‌త సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ పెద్ద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 4:31 AM GMT
చిక్కుల్లో ప‌డ్డ దినేశ్ కార్తిక్‌.. బ్యాట్ల‌ను ప‌రాయి పురుషుల భార్య‌ల‌తో

భార‌త సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా క్రికెట్‌ వ్యాఖ్యాతగా మారిన దినేశ్ కార్తిక్‌.. బ్యాట్స్‌మెన్‌, బ్యాట్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. గురువారం ఇంగ్లాండ్‌, శ్రీలంక మ‌ధ్య రెండో వ‌న్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాత‌గా డికే వ్య‌వ‌హ‌రించాడు. మ్యాచ్ మ‌ధ్య‌లో అత‌డు మ‌హిళ‌ల గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు.

బ్యాట్స్‌మెన్‌కు తమ బ్యాట్లు న‌చ్చ‌క‌పోవ‌డం అనేది చాలా కామ‌న్‌ విషయమని, ఇతర బ్యాట్స్‌మెన్లు వాడే బ్యాట్లపై వారికి విపరీతమైన మోజు ఉంటుందని, ఓ విధంగా చెప్పాలంటే ఇతరుల బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని డికే వ్యాఖ్యానించాడు. దినేశ్ కార్తిక్ స‌ర‌దాగానే ఈవ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికి దీనిపై సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాట్ల‌ను ప‌రాయి పురుషుల భార్య‌ల‌తో పోల్చి చూడ‌డాన్ని నెటిజ‌న్లు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. తన వ్యక్తిగత విషయాలు గుర్తుకువచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమోనని కొంద‌రు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. సాధార‌ణంగా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే క్ర‌మంలో స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తుంటారు. కాగా.. డికే కూడా ఇలాగే చేయ‌బోయి ఇర‌కాటంలో ప‌డ్డాడు.

Next Story
Share it