వామ్మో కోహ్లీ, ఊర్వశీ రౌతెలా తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?

Did you know Urvashi Rautela and Virat Kohli drink this expensive black water?.కోహ్లీతో పాటు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా బ్లాక్‌ వాటర్‌ను తాగుతారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 March 2021 6:02 PM IST

Did you know Urvashi Rautela and Virat Kohli drink this expensive black water?

సాధారణంగా ధనవంతులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు తమ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ద తీసుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే ఫిట్ నెస్ పై బాగా శ్రద్ద చూపిస్తుంటారు. ఇక ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిమ్, యోగ, నేచురల్ ఫుడ్స్ చివరికి వారు తాగే మంచి నీటి విషయంలో కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మార్కెట్లో లభించే అత్యుత్తమైన వాటినే ఎంచుకుంటారు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతగా సంపాదిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ఆయన లగ్జరీ లైఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆరోగ్యంపై స్పెషల్‌ కేర్‌ తీసుకునే విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా సందర్బాల్లో చెప్పుకోచ్చాడు. ఈ నీళ్ళలో హైడ్రేటెడ్‏గా ఉండడమే కాకుండా.. పీహెచ్ అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం వాడే వాటర్ బాటిల్ ఖరీదు.. రూ. 20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు..

అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇప్పుడు కోహ్లీతో పాటు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా బ్లాక్‌ వాటర్‌ను తాగుతారు. వీళ్లిద్దరితో పాటు పలువురు భారత సెలబ్రిటీలు కూడా స్పెషల్‌ వాటర్‌నే తాగుతారట. ఇక సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ వాటర్‌ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

గత ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్‌ వాటర్‌ తాగేందుకు ఆసక్తిచూపించారు. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, ఆరోగ్యంగా ఉండటానికి 'బ్లాక్ వాటర్'కు మారామని వాళ్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్పలో ఓ ఐటెమ్ సాంగ్‌లో ఊర్వశీ మెరవనుందని తెలుస్తోంది.


Next Story