ఓడిపోయిన తర్వాత వార్నర్ వ్యాఖ్యలను విన్నారా..?
Warner's comments after losing the match.తమ జట్టు ఓటమిలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 29 April 2021 3:27 PM ISTఢిల్లీ వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్లు విజృంభించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని ఎంతో సులువుగా ఛేజ్ చేశారు. దీంతో పాయింట్ల పట్టికలో ధోనిసేన ఐదో విజయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో నిలువగా.. రైజర్స్ ఐదో పరాజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ ఫ్లే ఆప్స్ అవకాశాలు క్లిష్టం అవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ధాటిగా ఆడుంటే 200 పరుగులు చేసే అవకాశం ఉండేదని అందరూ భావిస్తూ ఉన్నారు. మ్యాచ్ తర్వాత వార్నర్ కూడా అదే విషయాన్ని వెల్లడించాడు.
తమ జట్టు ఓటమిలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. వికెట్ చాలా స్లోగా ఉందని.. సీఎస్‌కే ఫీల్డర్లు తనను పదే పదే విసిగించారన్నాడు. తాను బహుశా 15 షాట్లను ఫీల్డర్లు ఉన్న ఏరియాలోకే కొట్టానని, దాంతోనే జట్టు కోసం ఇంకా అదనంగా ఏమీ చేయలేకపోయానన్నాడు. తాను షాట్ కొట్టడం అక్కడ ఫీల్డర్ ఉండటం తనకు విసుగుపుట్టించిందని తెలిపాడు. 171 పరుగులు చేసినా పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం చాలా మైనస్ అని అన్నాడు. ఈ తరహా వికెట్‌పై పవర్ ప్లేలో వికెట్లు తీయకపోతే లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టంగానే ఉంటుందని.. చెన్నై ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నాడు వార్నర్. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్ బాగా ఆడారని అన్నాడు. కేన్ నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడంలో ఎటువంటి సమస్య లేదని.. అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడని అన్నాడు వార్నర్. మేము పోరాట యోధులం.. తిరిగి పుంజుకుంటామని అన్నాడు వార్నర్.