ధోని అభిమాని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే.?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోనికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.
By Medi Samrat Published on 19 Jan 2024 9:15 PM ISTభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోనికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కావడంతో ధోని అంటే తమిళనాడు ప్రజలకు కూడా ఎంతో అభిమానం. కడలూరు జిల్లా తీటకుడి సమీపంలోని అరంగుర్ గ్రామానికి చెందిన గోపీ కృష్ణన్ ధోని వీరాభిమాని. ధోనీ, CSK కోసం, అతను తన ఇంటిని పూర్తిగా పసుపు రంగులో మార్చాడు. ధోనీ ఫోటోలు అతని ఇంటి నిండా ఉంటాయి. ఆ ఇంటిని చూసేందుకు అనేక నగరాల నుంచి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు గోపీ కృష్ణన్ ఇంటికి వస్తుంటారు. అలాంటి గోపీకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం క్రికెట్ అభిమానులను కలిచివేసింది. గోపికృష్ణన్‌కు భార్య అన్భరసి.. కిషోర్, శక్తివేల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 10 రోజుల క్రితమే ఓ పాప కూడా పుట్టింది. ఇంతలో గోపికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రామనాథంలోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ కొన్ని కుటుంబ సమస్యల కారణంగా గోపీ కృష్ణన్ ఈ తీవ్ర చర్య తీసుకోవడానికి దారితీసినట్లు నమ్ముతారు. తన ఇంటిలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్‌పై దాడి చేసినట్లు అతడి సోదరుడు రామనాథం తెలిపారు. పక్క గ్రామానికి చెందిన వారితో ఆర్ధిక లావాదేవీల కారణంగా గొడవ జరిగిందని.. ఆ పరిణామంతో తన సోదరుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.