చాహల్ పాంచ్ పటాకా.. ఆటపట్టించిన భార్య
Dhanashree Verma teases husband Yuzvendra Chahal.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో యుజ్వేంద్ర
By తోట వంశీ కుమార్ Published on 19 April 2022 2:21 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో యుజ్వేంద్ర చాహల్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 176 పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన చహల్ సతీమణి ధనశ్రీ వర్మ ఆనందంతో ఎగిరి గంతులు వేసింది.
మ్యాచ్ అనంతరం చాహల్ డగౌట్‌లోకి రాగా.. గ్యాలరీలో నిలుచున్న ధనశ్రీ వర్మ భర్తను ఇంటర్వ్యూ చేసింది. 'నేను బబుల్ వెలుపల ఉన్నాను కదా? ఎలా అనిపిస్తోంది?' అని ధనశ్రీ అడుగగా.. ఈ ఫీలింగ్ చాలా బాగుంది అంటూ చాహల్ చెప్పాడు. 'హ్యాట్రిక్ వికెట్లు తీశావు కదా.. సంతోషంగా కనిపిస్తున్నావ్ కదా' అని ధన శ్రీ అడుగగా.. 'అవును తొలి హ్యాట్రిక్ కదా 'అంటూ చాహల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా.. ధను శ్రీ పక్కనే ఉన్న రాజస్థాన్ జట్టు ప్రతినిధి హ్యాట్రిక్ మాత్రమే కాదు ఐదు వికెట్లు తీశావు కదా గ్రేట్ అంటూ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయాని వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (103; 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ సీజన్‌లో రెండో సెంచరీతో అదరగొడితే.. కెప్టెన్ సంజూ శాంసన్ (38; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (26; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85; 51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆరోన్ ఫించ్ (58; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినప్పటికీ చాహల్ మాయ కారణంగా విజయానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది.