వైరల్‌గా మారిన టీమిండియా స్పిన్నర్ సతీమణి డాన్స్..!
Dhanashree Verma Dance Video Goes Viral. టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి డాన్స్ వైరల్.
By Medi Samrat Published on 21 Jan 2021 9:55 AM ISTటీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. క్రికెటర్స్ ఎవరైనా సోషల్ మీడియా ద్వారా వారి సంగతులు పంచుకున్న వాటిని ట్రోల్ చేస్తూ వారిని ఆట పట్టిస్తుంటాడు. అయితే తాజాగా చాహల్ ఓ ఇంటివాడైన సంగతి మనకు తెలిసిందే. యూట్యూబ్ డాన్సర్ గా మంచి పేరు సంపాదించుకున్న ధనశ్రీ వర్మను గత ఏడాది డిసెంబర్ లో చాహల్ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
పెళ్లి అనంతరం ఈ జంట హనీమూన్ నిమిత్తం దుబాయ్ కి వెళ్లారు. వీరి హనీమూన్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ డాన్సర్ గాఎంతో మంచి పేరును సంపాదించుకున్న దన శ్రీ వర్మ ఛానల్ కు లక్షలలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. తాజాగా ధనశ్రీ వర్మ బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ నటించిన బ్లఫ్‌మాస్టర్ చిత్రంలోని బురోబురో పాటకు ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు.
ధన శ్రీ ఎంతో అద్భుతంగా ఆ పాటకు డాన్స్ చేసిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా వీరి హనీమూన్ ముగించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఇంటికి అతిథులుగా వెళ్లి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ధనశ్రీ వర్మ డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.