అయ్యో డిసిల్వ.. ఇలా ఔటైయ్యావేంటి..? వీడియో వైరల్
Dhananjaya De Silva's Bizarre Hit-Wicket Dismissal Against West Indies.సాధారంగా బ్యాట్స్‌మెన్ క్యాచ్ లేదా బౌల్డ్ లేదా
By తోట వంశీ కుమార్ Published on 23 Nov 2021 7:40 AM GMTసాధారంగా బ్యాట్స్‌మెన్ క్యాచ్ లేదా బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ లేదా రనౌట్‌గా ఔట్ కావడం మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి హిట్‌వికెట్‌గా వెనుదిరుగుతుంటాడు. తాజాగా శ్రీలంక ఆల్‌రౌండర్ ధనంజ డిసిల్వాను దురదృష్టం వెంటాడింది. దీంతో అతడు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో ధనుంజయ డిసిల్వ ఇలా ఔట్ అయ్యావేంటి అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అర్థశతకం సాధించి మంచి ఊపుమీదున్న ధనుంజయ డిసిల్వ(61; 95 బంతుల్లో 5 పోర్లు) వెస్టిండీస్ పేసర్ షెనన్ గాబ్రియాల్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. డిసిల్వబ్యాక్‌పుట్‌పై నిలుచొని బంతిని ఢిపెన్స్ ఆడాడు. బంతి కింద పడి స్టంట్స్‌పై పడుతుంది. వెంటనే స్పందించిన డిసిల్వ బంతిని అడ్డుకునేందుకు బ్యాట్‌తో బంతిని పక్కకు అనే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అతడి బ్యాట్ వికెట్లను తాకి బెయిల్స్ పడ్డాయి. ఇలా తనని తానే ఔట్ చేసుకున్నాడు డిసిల్వ. ఈ క్రమంలో తన పేరు మీదుగా ఓ చెత్త రికార్డును లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో రెండు సార్లు హిట్‌వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Simran (@CowCorner9) November 22, 2021
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 133.5 ఓవర్లలో 386 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(300 బంతుల్లో 15 ఫోర్లతో 147) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక (140 బంతుల్లో 7 ఫోర్లతో 56), డిసిల్వా హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టెన్ చేజ్ 5 వికెట్లు పడగొట్టగా.. జోమెల్ వారికన్ మూడూ, షెనన్ గాబ్రియల్ రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.