టెస్టుల్లో డెవాన్ కాన్వే స‌రికొత్త రికార్డు

Devon Conway create new record in tests.న్యూజిలాండ్ ఆట‌గాడు డెవాన్ కాన్వే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఆడిన తొలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 9:19 AM GMT
టెస్టుల్లో డెవాన్ కాన్వే స‌రికొత్త రికార్డు

న్యూజిలాండ్ ఆట‌గాడు డెవాన్ కాన్వే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఆడిన తొలి ఐదు టెస్టుల్లోని మొద‌టి ఇన్నింగ్స్‌లు అన్నింటిల్లోనూ 50 కి పైగా ప‌రుగులు సాధించిన రికార్డును త‌న పేరున లిఖించుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కాన్వే ఈ రికార్డును నెల‌కొల్పాడు. కాన్వే ఇప్ప‌టి వ‌ర‌కు 5 టెస్టులు ఆడ‌గా.. ఐదు టెస్టుల్లో 50కిపైగా ప‌రుగులు సాధించాడు. దీంట్లో ఓ ద్విశ‌త‌కం, ఓ సెంచ‌రీ, మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

గతేడాది జూన్​లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా డెవాన్ కాన్వే న్యూజిలాండ్ త‌రుపున అరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌ల్లోనే ద్విశ‌త‌కంతో సంచ‌న‌లం సృష్టించాడు. ఎడ్జ్​బాస్టన్​ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులోనూ 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా భార‌త్‌తో జ‌రిగిన టెస్టు ఛాంఫియన్​షిప్ ఫైనల్లోనూ 54 పరుగులతో కాన్వే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. గత వారం బంగ్లాదేశ్‌తో మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన తొలి టెస్టులో కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (122) చేశాడు. ఈ రోజు క్రైస్ట్‌చర్చ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో 99 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి టెస్టులో ఓడిపోయిన కివీస్ ఈ మ్యాచ్‌లో విజృంభిస్తోంది. తొలి రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ వికెట్ న‌ష్టానికి 349 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ విల్‌యంగ్ 54 ప‌రుగులు చేసి ఔట్ కాగా.. మ‌రో ఓపెన‌ర్‌, కెప్టెన్ టామ్‌లాథ‌మ్ 186, డెవాన్ కాన్వే 99 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

Next Story
Share it