దంచికొట్టిన డివిలియర్స్.. ఢిల్లీ ఎదుట భారీ లక్ష్యం
Delhi Target 172. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్
By Medi Samrat Published on
27 April 2021 4:04 PM GMT

ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 171 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు విఫలమవగా.. మిస్టర్ 360.. ఏబీ డివిలియర్స్(75 నాటౌట్: 42 బంతుల్లో.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో అదరగొట్టాడు.
ముఖ్యంగా చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో 3 సిక్స్‌లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆర్సీబీ 170కి పైగా పరుగులు చేసింది. డివిలియర్స్‌తో పాటు రజత్ పాటిదార్(31: 22 బంతుల్లో.. 2 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(25: 20 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) చక్కటి ప్రదర్శన చేశారు. ఢిల్లీ బౌలర్లలో స్టయినీస్ మినహా బౌలర్లందరూ తలా ఒక వికెట్ తీశారు. మరికాసేపట్లో 172 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగనున్న క్రమంలో ఈదురుగాలులు మ్యాచ్‌కు అడ్డంకిగా మారాయి. గాలులు ఆగిన తరువాత మ్యాచ్ ప్రారంభమవనుంది.
Next Story