ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన క‌రోనా.. ఓ ఆట‌గాడికి పాజిటివ్‌..!

Delhi Capitals player tests positive for COVID-19.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2022 సీజ‌న్ లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2022 1:10 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన క‌రోనా.. ఓ ఆట‌గాడికి పాజిటివ్‌..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2022 సీజ‌న్ లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ప్రేక్ష‌కుల‌కు అస‌లు సిస‌లు వినోదాన్ని అందిస్తున్నాయి. ఐదుసార్లు ఛాంపియ‌న్ అయిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఈ టోర్నీలో ఇంత వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క మ్యాచులోనూ గెల‌వ‌లేదు. గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఐపీఎల్‌ను రెండు బాగాలుగా నిర్వ‌హించ‌గా.. ప్ర‌స్తుతం సీజ‌న్‌కు క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులోని ఓ ఆట‌గాడికి క‌రోనా సోకిన‌ట్లు స‌మాచారం.

దీంతో పంజాబ్‌తో మ్యాచ్ కోసం పుణె వెళ్లాల్సిన ఢిల్లీ జ‌ట్టు త‌న ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకుంది. ఓ ఆట‌గాడికి క‌రోనా సోక‌డంతో జ‌ట్ట‌లోని మిగ‌తా ఆట‌గాంద‌ర్నీ ప్ర‌స్తుతం క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 20న పంజాబ్‌తో ఢిల్లీ జ‌ట్టు ఆడాల్సిన మ్యాచ్‌పై సందిగ్థం నెల‌కొంది. కాగా.. దీనిపై అటు ఢిల్లీ యాజ‌మాన్యం కానీ, ఇటు ఐపీఎల్ నిర్వాహ‌కులు గానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ను చేయ‌లేదు.

మూడు రోజుల ముందు ఢిల్లీ జ‌ట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫ‌ర్హాట్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆట‌గాళ్ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఒక‌రికి పాజిటివ్‌గా తేలింది. ఇక విషయం తెలిసిన ఢిల్లీ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆట‌గాడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

Next Story